Advertisement
జిగితార జిగితార దిగినావా మనసారా
ఆకశాన్ని వీడి ఈ ఆకతాయికై
భూమి చేరినావు నా మౌన దేవతై
బతకాలనున్నదే ఇక నీకు బానిసై
ప్రతి రోజూ నీకిలా సేవ చేయడానికై
Advertisement
జిగితార జిగితార దిగినావా అరె మనసారా
బావిలో ఈదే జీవిలా ఉండగా
పువ్వులా తావిలో ముంచి తేల్చావుగా
రేవులే లేని నావలే నవ్వగా
తోవలో దీవిలా నన్ను చేరావుగా
పగలైనా చీకటే నా నిన్నకీ
నడిరేయి వేకువే ఈ నేటికీ
హరివిల్లువైతివీ నల్ల కాగితానికీ
జిగితార జిగి జిగితార దిగినావా అరె మనసారా
రాత్రిలో రాజ పాటనై మోగుతా
తీయని లాలిలో హాయిగా సోలిపో
భారతీరాజా చిత్రమై చేరుతా
రంగున మాయలో రోజునే మర్చిపో
వడివేలై అందుతా నీ వేలుకీ
సరదాగా నవ్వుకో ఈ వేళకి
సినిమాని మించిన జీవితాన్ని చూపుతా
నిలవేణి నిలవేణీ అడగానా ఇన్ములియేనీ
నీకు ఏది వేణుమో ఆర్డరేసుకో
నీకు ఎంత పోదుమో అంత వాడుకో
కథలన్నీ కంచికే అని అందరందురే
కామాక్షి ముందరే స్టార్టయింది నా కథే