Advertisement
ఇలాగె ఇలాగె ఇలాగె
నిన్నే చేరుకుంటానిలాగే
ఇదే ప్రేమని మరేం కాదని
ప్రియా సూటిగా చెప్పలేవా
Advertisement
కలేం కాదని ఎదే నీదని
ఇలా గుండెలో వాలిపోవా
ఇలాగె ఇలాగె ఇలాగె
నిన్నే చేరుకుంటానిలాగే
గాలిలో నీ పేరుని రాసి
ఊహలో నీ చెయ్యిని తాకి
ఎంతగా మురిసిందో చూడు
అయ్యో పాపం నాలో ప్రేమా
ఏమిటో ఈ తియ్యని భాధ
మౌనమే బదులనుకోలేవా
మాటలే మరి సరిగా రావు
ఏమయ్యిందో నాకివేళ
వూళ్ళో వాలు దిన్నేనయ్యో ప్రేమంటారు
అవునా నాకు చెప్పేవారు లేనే లేరు
మరీ మొయ్యకు కధే అల్లకు
ప్రియా నీకు చెప్పాను నేను
ఇదే ప్రేమని ఇవాళే కదా
నిజం తెలుసుకున్నాను నేను
ఇలాగె ఇలాగె ఇలాగె
నిన్నే చేరుకుంటానిలాగే
ఇప్పుడే ఓ వింతని చూసా
చెప్పినా నువ్వు నమ్మవు తెలుసా
నమ్మితే ఒకసారి ఇటు చూడు
నాలో వుంది నువ్వే తెలుసా
ఇందులో అరే వింతేముంది
ముందుగా ఇది రాసేవుంది
అంతగా ఆ మాటకి వస్తే
నాలో వుంది నువ్వే తెలుసా
నువ్వు నేను ఏకం అయితే ఏమవుతుంది
లోకం లోనే వేరే కాని ప్రేమవుతుంది
నిజం చెప్పనా చెలి ఎప్పుడో
మదే మీటి పోయింది ప్రేమ
ఇలా హాయిగా మరి తీయగా
అలై తాకి పోయింది ప్రేమ
ఇలాగె ఇలాగె ఇలాగె
ప్రేమించేసుకుందాం ఇలాగె
ఇలాగె ఇలాగె ఇలాగె
ప్రేమించేసుకుందాం ఇలాగె