Advertisement
ఎంత చిత్రం కదా
ఒక చూపుకే ఒరిగిపోయా
ఎంత ఘోరం కదా
ఒక నవ్వుకే ఓడిపోయా
తప్పు ఒప్పు ఆలోచించే వీలే లేదాయె
తప్పనిసరిగా తిప్పలు వచ్ఛే ప్రేమే వరదాయే
ఏ ముప్పును తప్పుకుపోయే వేరే దారే కనపడదాయే
Advertisement
ఎంత చిత్రం కదా
ఒక చూపుకే ఒరిగిపోయా
ఎంత ఘోరం కదా
ఒక నవ్వుకే ఓడిపోయా
కంటి వైపు రానంది కునుకు
కత్తి మీద సామైంది బతుకు
గుండెల్లోనా పుట్టింది ఒణుకు
గొంతు దాటి రానంది పలుకు
ఓరి దేవుడో ఇంత కోపమా నాపైన నీకు
చెప్పాలంటే అంత సులభమా శక్తినివ్వు నాకు
ఇక ఒక్క పూటైనా
నేను ఓర్చుకోగలనా
ఏదేమైనా ఎదో ఒకటి చెప్పేస్తా తనకు
ఎంత చిత్రం కదా
ఒక చూపుకే ఒరిగిపోయా
ఎంత ఘోరం కదా
ఒక నవ్వుకే ఓడిపోయా
నన్నే గుచ్చ్చిపోయింది సొగసు
ఒళ్ళే మరచిపోయింది మనసు
ఉన్నట్టుండి లేచింది వయసు
ప్రేమో పిచ్చొ నాకేమి తెలుసు
ఎంత ఆపినా ఆగనంది దూకే అడుగు
ఎంత దూరమో తెలియకున్నది తుళ్ళే పరుగు
తన తీరమేదైనా
ఏ దారిలోనైనా
చేరే వరకు అలుపే లేదు పట్టేస్తా తుదకు
ఎంత చిత్రం కదా
ఒక చూపుకే ఒరిగిపోయా
ఎంత ఘోరం కదా
ఒక నవ్వుకే ఓడిపోయా
తప్పు ఒప్పు ఆలోచించే వీలే లేదాయె
తప్పనిసరిగా తిప్పలు వచ్ఛే ప్రేమే వరదాయే
ఏ ముప్పును తప్పుకుపోయే వేరే దారి కనపడదాయే
ఎంత చిత్రం కదా
ఒక చూపుకే ఒరిగిపోయా
ఎంత ఘోరం కదా
ఒక నవ్వుకే ఓడిపోయా