Advertisement
ఎంతెంత దూరం తీరం రాదా
ఇంకెంత మౌనం దూరం కాదా
ఏ నాడు ఏకం కావు
ఆ నింగి నెల
ఈ నాడు ఏకం అయితే
వింతేగా
ఏ రోజు ఏమౌతుందో
ఈ ప్రేమ గాధ
నీ వైపు మళ్ళిందంటే
మాయెగా
Advertisement
మాయేరా మాయేరా ప్రేమ అన్నది మాయే లేరా
ఊరించే ఊహ లోకం లేరా
మాయేరా మాయేరా రంగు రంగులు చూపే దేరా
రంగంటు లేనే లేదు లేరా
ఎంతెంత దూరం తీరం రాదా
ఇంకెంత మౌనం దూరం కాదా
ఏ నాడు ఏకం కావు
ఆ నింగి నెల
ఈ నాడు ఏకం అయితే
వింతేగా
ఏ రోజు ఏమౌతుందో
ఈ ప్రేమ గాధ
నీ వైపు మళ్ళిందంటే
మాయెగా
ఊహల్లో ఊసుల్లో ఆ మాటే
ఓసోసి గొప్ప ఏముంది గనక
తానంటూ నీ వెంటే ఉందంటే
ఆ ఎండా కూడా వెండి వెన్నెలవదా
అవునా అదంతా నిజామా
ఏదేది ఓ సారి కనపడదా
ఇలలో ఎందెందు చుసిన
అందందునే ఉంటుందిలే బహుశా
మాయేరా మాయేరా ప్రేమ ఎక్కడో లేదు లేరా
నీ చెంతే వుండే దూరం లేరా
హాయిలే హాయిలే ఎల్లలన్నవి లేనే లేవే
ప్రేమిస్తే లోకం మొత్తం హాయి
ప్రేమిస్తే ఎంతైనా వింతేలే
నువ్వెంత చెప్పు గుండెల్లో గుబులే
ఈడొస్తే ఈడైన ఇంతేనా
ఇంతోటి తీపి ఏమున్నదైన
సెలవా నా మాట వినవా
ఏ నాడు నువ్ ప్రేమలో పడవ
నిజామా ఈ ప్రేమ వరమా
కల్లోలయిన ఊహించని మహిమ
మాయేరా మాయేరా ప్రేమ అన్నది మాయే లేరా
ఇద్దరిలోను ఇంద్రజాలం లేరా
హాయేలే హాయేలే ఎల్లలన్నవి లేనే లేవే
ప్రేమిస్తే లోకం మొత్తం హాయి
ఎంతెంత దూరం తీరం రాదా
ఇంకెంత మౌనం దూరం కాదా
ఏ నాడు ఏకం కావు
ఆ నింగి నెల
ఈ నాడు ఏకం అయితే
వింతేగా
ఏ రోజు ఏఏమౌతుందో
ఈ ప్రేమ గాధ
నీ వైపు మళ్ళిందంటే
మాయెగా