2025

ఏం జరుగుతోంది

Em Jaruguthondhi

🎬 The Girlfriend
Advertisement
కలకలమును కలగలిపిన కధ మొదలా హే కలవరమున తెగనలిగిన నిజము కలా
Advertisement

ఎం చెయ్‍ను తడబడిన తప్పటడుగా మతిచెడెనా ఏమో సతమతమౌ తలపేదో నిలదీసి నన్నడిగెనుగా
ఏం జరుగుతోంది ఏం జరుగుతోంది మనసా తెలుసా మనసా ఆ ఆ ఆఆ ఆ ఏం జరుగుతోంది ఏం జరుగుతోంది తెలిసే కలిసే మనసా ఆ ఆ ఆ ఏం జరుగుతోంది ఏం జరుగుతోంది ఇకపై ఇది నీ వరసా ఆఆ ఆ ఆ
ఏ కారణమంటే ఏం పలకని మౌనం వలపంటే ఇంతేనా ఆశ్చర్యం నా పదనిస శృతిలోనా నీ సరిగమ కలిసేనా అర్ధాలో అపార్ధాలో తెలియకనే పయనం
సరి అని అనుకోవాలో తగదని దాటేయాలో నీకైనా తెలిసిందా తెలుపకనే తెలిపే క్షణమా
ఏం జరుగుతోంది ఏం జరుగుతోంది మనసా తెలుసా మనసా ఆ ఆ ఆఆ ఆ ఏం జరుగుతోంది ఏం జరుగుతోంది ఇకపై ఇది నీ వరసా ఆఆ ఆ ఆ ఆ
మరీచిక సమ సంబంధం సందిగ్ధం సత్ సాన్నిత్యం మస్తిష్కం భ్రమరాగమనం విపదం ద్విముఖం వంచింతం
ఎదుటే ఉన్నా దూరం ఎటు వైపో నా తీరం ఊహల్లో ఊహించే రూపం ఇది అనుకోవాలా
కలకలమును కలగలిపిన కధ మొదలా హే కలవరమున తెగనలిగిన నిజము కలా హా ఎం చెయ్‍ను తడబడిన తప్పటడుగా మతిచెడెనా ఏమో సతమతమౌ తలపేదో నిలదీసి నన్నడిగెనుగా