Advertisement
ఆకాశం విరిగినట్టు కాకూడనిదేదో జరిగినట్టు
కిమ్ కర్తవ్యమ్ అని కలవరపడడం కొందరి తరహా
అవకాశం చూసుకుంటూ ఆటంకాలొడుపుగా దాటుకుంటూ
వాటం గ దూసుకుపోతే మేలని కొందరి సలహా
ఎదో తలవడం వేరే జరగడం సర్లే అనడమే వేదాంతం
దేన్నో వెతకడం ఎన్నో అడగటం ఎపుడు తేమాలని రాద్ధాంతం
Advertisement
ఎం చేద్దాం అనుకుంటే మాత్రం ఎం పొడిచేస్తాం
ఎం చూద్దాం మునుముందేముందో తెలియంది చిత్రం
ఏమందాం మననేవారడిగారని ఏమని అంటాం
ఎం విందాం తార త్వరిత టక టక ధూమ్ ధూమ్ టక ధూమ్
ఆకాశం విరిగినట్టు కాకూడనిదేదో జరిగినట్టు
కిమ్ కర్తవ్యమ్ అని కలవరపడడం కొందరి తరహా
అవకాశం చూసుకుంటూ ఆటంకాలొడుపుగా దాటుకుంటూ
వాటం గ దూసుకుపోతే మేలని కొందరి సలహా
ఫాలో పదుగురి బాట బోలో నలుగురి మాట
లోలో కలవరపాటా దాంతో గడవదు పూట
ఇట అట అని ప్రతొక్క దారిని నిలేసి అడగకు సహోదర
ఇదే ఇదే అని ప్రమాణ పూర్తి గ తెగేసి చెప్పేదెలాగరా
ఇది గ్రహించినరీ మహాజనం ప్రయాస పడి ఎం ప్రయోజనం
సిమెంట్ బుట్టల సహారా దారిది నిలవడం కుదరదు కదలిరా
ఎన్నో పనులను చేస్తాం ఏవో పరుగులు తీస్తాం
మ్మ్... సతామతమవుతాం
ఓహోఓ బతుకిదే అంటాం
ఆడంగు తెలియని ప్రయాణమే యుగ యుగాలుగా మన అయోమయం
వెనక్కు తిరగని ప్రవాహమే ఏ తుఫాను తరిమిన ప్రతిక్షణం
ఇది పుటుక్కు జర జర డుబుక్కు మెయిన్ అడగకు అది ఒక రహస్యమే
ఫలానా బడులని తెలీని ప్రశ్నలు అడగటం తగదు గ