2003

ఈ రేయి తీయనిది

Ee Reyi Teeyanidi

🎬 Johnny
Advertisement
ఈ రేయి తీయనిది ఈ చిరుగాలి మనసైనది ఈ హాయి మాయనిది ఇంతకు మించి ఏమున్నది
Advertisement

ఏవేవో కోరికలు ఎదలో ఝుమ్మని అంటున్నవి ఆ కొంటె మల్లికలు అల్లన దాగి వింటున్నవి
ఓ వరములా దొరికెనీ పరిచయం నా మనసులో కురిసెనే అమృతం నా నిలువునా అలలయే పరవశం నీ చెలిమికే చేయని అంకితం
కోరుకునే తీరముగా ఆగెను ఈ నిమిషం
ఏవేవో కోరికలు ఎదలో ఝుమ్మని అంటున్నవి ఆ కొంటె మల్లికలు అల్లన దాగి వింటున్నవి
నీ ఊపిరి వెచ్చగా తగలని నా నుదుటిపై తిలకమై వెలగని నా చూపులే చల్లగా తాకని నీ పెదవిపై నవ్వుగా నిలవని
ఆశలకే ఆయువుగా మారెను నీ స్నేహం
ఈ రేయి తీయనిది ఈ చిరుగాలి మనసైనది ఈ హాయి మాయనిది ఇంతకు మించి ఏమున్నది
ఇంతకు మించి ఏమున్నది ఇంతకు మించి ఏమున్నది