2002

చుక్కల్లో

Chukkallo

🎬 Takkari Donga
Advertisement
చుక్కల్లో చంద్రుడీ చిన్నోడు చూపుల్లో సూర్యుడీ సోగ్గాడు ముద్దొస్తూ వున్నవే అమ్మాయి మోగించెయ్ మంటవా సన్నాయి
Advertisement

సింగంలా దూకరా మగధీరుడా దమ్మెంతో చూపరా పని వీరుడా మాటల్తో చంపకే ఓ బాలికా వస్తాలే కాసుకో నీ ఓపిక
హలో హైసలకిడి బావ నను సోకులకిడి కోవ వద్దనక ముద్దులతో మురిపించవా
హలో పిట్టనడుము పిల్లో నీ వాలు చూపువల్లో నేను మరి తేలికగా పడిపోనల్లా
చుక్కల్లో చంద్రుడీ చిన్నోడు ముద్దొస్తూ వున్నవే అమ్మాయి
పాల పొంగు పాప తెగ రువ్వకే నవ్వు నీలి కళ్ళ చేప వల వెయ్యకే నువ్వు గాలిలాగ వచ్చి నను తాకితే నువ్వు మాయదారి మోహం తొణికించదా నవ్వు
ఇద్దరి కధ ఇవ్వాళే తెంచెయ్యకు విచ్చల విడి దుకాణం పెట్టెయ్యకు హద్దిరి మన యవ్వారం పెంచెయ్యకు అద్దిరిపడి గుడారం దించెయ్యకు
హలో పిట్టనడుము పిల్లో నీ వాలు చూపువల్లో నేను మరి తేలికగా పడిపోనల్లా
హలో హైసలకిడి బావ నను సోకులకిడి కోవ వద్దనక ముద్దులతో మురిపించవా
ముద్దొస్తూ వున్నవే అమ్మాయి చుక్కల్లో చంద్రుడీ చిన్నోడు
టిప్పుటాపు బావ మొహమాటమేలేదు అప్ టు డేటు గుంటే డౌటన్నదే రాదు రాలుగాయి పిల్లా చెలగాటమే వద్దు కాలు జారకుండా మన కుందిలే హద్దు
కష్టమనకు ఓరయ్యో ఈ పూటకు ఇష్టసఖిని ఇలాగే జోకొట్టకు కూత పెరిగెనివాళే ఈ పిట్టకు తోడు పెరుగునివాలి నా పెట్టకు
ఇలా చూడు టక్కరి దొంగ చెల ఈడు కిట్టకు బెంగ చీరలకి సిగ్గులకి సెలవే ఇక
హల్లో హంసనడక పిల్లో సిరి మల్లెల చిరుజల్లో ఇప్పుడిక తప్పదిక తొలి వేడుక
ఇలా చూడు టక్కరి దొంగ చెల ఈడు కిట్టకు బెంగ చీరలకి సిగ్గులకి సెలవే ఇక
హల్లో హంసనడక పిల్లో సిరి మల్లెల చిరుజల్లో ఇప్పుడిక తప్పదిక తొలి వేడుక