Advertisement
చూడొద్దు అంటున్న చూస్తూనే వుంటా
నా కోసం ఇంతందంగా పుట్టావనుకుంటా
వద్దొద్దంటున్న వస్తూనేవుంటా
కలకాలం నీ కౌగిలిని నా ఇల్లనుకుంటా
Advertisement
వచేయినా వచేయినా మొహమాటం ఇంకా మనకేల
వచేయినా వచేయినా ఆరాటం ఏదో కలిగేలా
వచేయవ వచేయవ బొట్టెట్టి నిన్ను పిలవాలా
వచేయవ వచేయవ వచేయవ
సడియో సడియో సడియో నేనే వస్తానుగా
సడియో సడియో సడియో నీతో వుంటానుగా
సడియో సడియో సడియో నువ్వే కావాలిగా
సడియో సడియో సడియో నాకే ఇల్లాలిగా
చూడొద్దు అంటున్న చూస్తూనే వుంటా
నా కోసం ఇంతందంగా పుట్టావనుకుంటా
నువ్వు నేను ఒకరికి ఒకరం చెరిసగమనుకుంటా
కాసేపైనా కనబడకుంటే కలవరపడుతుంటా
పక్కన నువ్వే వున్నావనుకొని పొరబడిపోతుంటా
నిద్దరిలోన తలగడకెన్నో ముద్దులు పెడుతుంటా
ఎదురుగ్గా ఎవరున్నా ఎదనిండా నువ్వంటే
ఎవిరిడే ఓ సరైన కాన్ఫుజ్ అవుతుంటా
చుట్టూరా ఎందరు వున్నా ఒంటరినవుతుంటా
నువ్వు లేని లైఫ్ ఏ బోర్ అని ఫీల్ అయి పోతుంటా
వచేయవ వచేయవ బొట్టెట్టి నిన్ను పిలవాలా
వచేయవ వచేయవ వచేయవ
సడియో సడియో సడియో నేనే వస్తానుగా
వొడిలో వొడిలో వొడిలో చోటే ఇస్తానుగా
సడియో సడియో సడియో నువ్వే రావాలిగా
గడియో గడియో గడియో నేనే తీస్తానుగా
ఎన్నాలైన వీడని బంధం మనదేననుకుంటా
చూపులు కలిసిన తరుణం ఎంతో బాగుందనుకుంటా
నీ వెనకాలే ఒక్కో అడుగు వెయ్యాలనుకుంటా
నీ చేతుల్లో బంధీనయ్యె భాగ్యం ఇమ్మంటా
నువ్వుంటే ఎవ్వరినైనా ఎదిరిస్తానంటా
నీ కోసం ఎక్కడికైనా ఎగిరొస్తానంటా
నీ కన్నా విలువైంది నాకేది లేదంట
నీ కోసం ప్రాణాలైనా ఇచ్చేస్తానంటా
వచేయవ వచేయవ బొట్టెట్టి నిన్ను పిలవాలా
వచేయవ వచేయవ వచేయవ
హ సడియో సడియో సడియో నేనే వస్తానుగా
వొడిలో వొడిలో వొడిలో చోటే ఇస్తానుగా
సడియో సడియో సడియో నువ్వే రావాలిగా
గడియో గడియో గడియో నేనే తీస్తానుగా
చూడొద్దు అంటున్న చూస్తూనే వుంటా
నా కోసం ఇంతందంగా పుట్టావనుకుంటా
వద్దొద్దంటున్న వస్తూనేవుంట
కలకాలం నీ కౌగిలిని నా ఇల్లనుకుంటా