Advertisement
చందమామ రావే జాబిల్లి రావే
కొండెక్కి రావే గోగుపూలు తేవే
మబ్బులెక్కి రావే మంచి గంధం తేవే
పల్లకి లో రావే పారిజాతం తేవే
Advertisement
చందమామ రావే జాబిల్లి రావే
చందమామ రావే జాబిల్లి రావే
కొండెక్కి రావే గోగుపూలు తేవే
తల్లి తేనె పాటకి తల్లడిల్లి పోకే
కల్లబొల్లి మాటకి కలవరమెందుకే
మనుషుల మాటకి నిలకడ లేదులే
అసలీ నేలపై నిజమే లేదులే
చందమామ రాకే జాబిల్లి రాకే
చందమామ రావే గుండె కోత చూడవే
దాయి దాయి దావే దారుణాలు చూడవే
మంచితనమన్నది అందనంత దూరం
నీతి లేని నేల పై నిజమే నేరం
ఎందుకంటు అడిగితే జరిగెనీ ఘోరం
చందమామ రావే గుండె కోత చూడవే
దాయి దాయి దావే దారుణాలు చూడవే