2022

భీమ్లానాయక్

Bheemla Nayak

🎬 Bheemla Nayak
Advertisement
సెభాష్
Advertisement

ఆడాగాదు ఈడాగాదు అమీరోల్లో మేడాగాదు గుర్రంనీల్లా గుట్టాకాడ అలుగూ వాగు తాండాలోన బెమ్మాజెముడు చెట్టున్నాది
బెమ్మజెముడూ చెట్టూకింద అమ్మా నెప్పులు పడతన్నాది ఎండాలేదు రేతిరిగాదు ఏగూసుక్కా పొడవంగానే పుట్టిండాడు పులిపిల్ల
పుట్టిండాడు పులిపిల్ల నల్లామల తాలూకాల అమ్మా పేరు మీరాబాయి నాయన పేరు సొమ్లా గండు నాయన పేరు సోమ్లా గండు తాతా పేరు బహద్దూర్ ముత్తులతాత ఈర్యానాయక్ పెట్టిన పేరు భీమ్లానాయక్
సెభాష్ భీమ్లానాయకా
భీమ్లానాయక్ భీమ్లానాయక్
ఇరగదీసే ఈడి ఫైరు సల్లగుండ ఖాకీ డ్రెస్సు పక్కనెడితే వీడే పెద్దగూండా నిమ్మళంగ కనబడే నిప్పుకొండ ముట్టుకుంటే తాట లేసిపోద్ది తప్పకుండా ఇస్తిరి నలగని చొక్కా పొగరుగ తిరిగే తిక్క చెమడాలొలిచే లెక్క కొట్టాడంటే పక్కా విరుగును బొక్క
భిం భీం భీం భీం భీమ్లానాయక్ బుర్ర రాం కీర్తన పాడించే లాఠీ గాయక్
భీం భం భం భం భీమ్లానాయక్ దంచి దడదడదడలాడించే డ్యూటి సేవక్
ఆ జుట్టునట్టా సవరించినాడో సింగాలు జూలు విదిలించినట్టే ఆ షర్టునట్టా మడతెట్టినాడో రంగాన పులులు గాండ్రించినట్టే ఆ కాలి బూటు బిగ్గట్టినాడో తొడగొట్టి వేట మొదలెట్టినట్టే
భీమ్లానాయక్ భీమ్లానాయక్
ఎవ్వడైన ఈడి ముందు గడ్డిపోస ఎర్రి గంతులేస్తే ఇరిగిపోద్ది ఎన్నుపూస కుమ్మడంలో విడే ఒక బ్రాండు తెల్సా వీడి దెబ్బతిన్న ప్రతివోడు పాస్టు టెన్సా నడిచే రూటే స్ట్రెయిటు పలికే మాటే రైటు టెంపరుమెంటే హాటు పవరుకు ఎత్తిన గేటు ఆ నేమ్ ప్లేటు
భం భం భం భం భీమ్లానాయక్ బుర్ర రాం కీర్తన పాడించే లాఠీ గాయక్ భీం భీం భీం భీం భీమ్లానాయక్ దంచి దడదడదడలాడించే డ్యూటి సేవక్
గుంటూరుకారం ఆ యూనిఫారం మంటెత్తిపోద్ది నకరాలు చేస్తే లావాదుమారం లాఠీ విహారం పేట్రేగిపోద్ది నేరాలు చూస్తే సెలవంటూ అనడు శనాదివారం అల్ రౌండ్ ది క్లాకు పిస్తోలు దోస్తే
భీమ్లానాయక్ భీమ్లానాయక్