2009

బేబీ హి లవ్స్ యు

Baby He Loves You

🎬 Arya 2
Advertisement
చ వాడికి న మీద ప్రేమే లేదు హి డస్న్ట్ లవ్ మీ యూ నో నో హి లవ్స్ యు హి లవ్స్ యు సో మచ్ అవునా ఎంత ఆ
Advertisement

మొదటి సారి నువ్వు నన్ను చూసినప్పుడు కలిగినట్టి కోపమంతా మొదటి సారి నేను మాట్లాడినప్పుడు పెరిగినట్టి ద్వేషమంతా మొదటి సారి నీకు ముద్దుపెట్టినప్పుడు జరిగినట్టి దోషమంతా చివరిసారి నీకు నిజం చెప్పినపుడు తీరినట్టి భారమంతా
ఓఓఓ ఇంకా
తెల్ల తెల్లవారి పల్లెటూరు లోన అల్లుకున్న వెలుగంత పిల్ల లేగదూడ నోటికంటుకున్న ఆవు పాల నురగంత
చల్ల బువ్వ లోన నంచుకుంటూ తిన్న ఆవకాయ కారమంతా పెళ్లి ఈడుకొచ్చి తుళ్ళిఆడుతున్న ఆడపిల్ల కోరికంత
బేబీ హి లవ్స్ యు హి లవ్స్ యు హి లవ్స్ యు సో మచ్ బేబీ హి లవ్స్ యు హి లవ్స్ యు హి లవ్స్ యు సో మచ్
అందమైన నే కాళీ కింద తిరిగే నెలకున్న బరువంతా నీలి నీలి నీ కళ్ళలోన మెరిసే నింగి కున్న వయసంత చల్లనైన నీ శ్వాసలోన తోణిగే గాలికున్న గతమంతా చుర్రుమన్న నీ చూపులోన ఎగిసే నిప్పు లాంటి నిజమంత
బేబీ హి లవ్స్ యు హి లవ్స్ యు హి లవ్స్ యు సో మచ్ బేబీ హి లవ్స్ యు హి లవ్స్ యు హి లవ్స్ యు సో మచ్
పంటచేలలోని జీవమంతా గంటసాల పాట భావమంతా పండగొచ్చినా పబ్బమొచ్చినా వంటశాలలోని వాసనంత కుంభకర్ణుడి నిద్దరంతా ఆంజనేయుడి ఆయువంతా కృష్ణ మూర్తి లో లీలలంతా రామ లాలి అంత
బేబీ హి లవ్స్ యు హి లవ్స్ యు హి లవ్స్ యు సో మచ్ బేబీ హి లవ్స్ యు హి లవ్స్ యు హి లవ్స్ యు సో మచ్
పచ్చి వేప పుల్ల చేదు అంత రచ్చబండ పైన వాదనంత అర్ధమైన కాకపోయినా భక్తి కొద్దీ విన్న వేదమంతా యేటి నీటిలోని జాబిలంతా ఏటా ఏటా వచ్చే జాతరంత ఏకపాత్రలో నాటకాలలో నాటు గోలలంతా
బేబీ హి లవ్స్ యు హి లవ్స్ యు హి లవ్స్ యు సో మచ్ బేబీ హి లవ్స్ యు హి లవ్స్ యు హి లవ్స్ యు సో మచ్
అల్లరెక్కువైతే కన్నతల్లి వేసే మొట్టికాయ చనువంతా జల్లుపడ్డ వేళా పొంగి పొంగి పూసే మట్టిపూల విలువంత బిక్కు బిక్కు మంటూ పరీక్ష రాసే పిల్లగాడి భేదురంతా లక్ష మందినైనా సవాలు చేసే ఆటగాడి పొగరంతా
బేబీ హి లవ్స్ యు హి లవ్స్ యు హి లవ్స్ యు సో మచ్ బేబీ హి లవ్స్ యు హి లవ్స్ యు హి లవ్స్ యు సో మచ్