2003

అత్తారింటికి నిన్నెత్తుకుపోతానుగా

Attarintiki ninnettukupotaanugaa

🎬 Okkadu
Advertisement
ముత్తైదులంతా మృదమారా ఈ బాలకి మంగళ స్నానాలు చేయించరే శ్రీరామ రక్షణ అనే క్షీరాబ్ధి కన్యకి ముమ్మారు దిష్టి తీసి దీవించరే
Advertisement

మనసు పడే మొగుడొస్తాడని మేనంతా మెరిసింది మెడిసి పడే మదిలో సందడి మేళాలై మ్రోగింది
నీకు నాకు ముందే రాసుంది జోడి
హరిలో రంగా హరి వహ్వా అంటూ చూస్తోంది పందిరి బరిలో హోరా హోరి బహు బాగుంది బాజా భాజంతిరి
అత్తారింటికి నిన్నెత్తుకుపోతానుగా వచ్చానే హంస వైభోగంగా కన్యాతనమిస్తా కళ్యాణం సాక్షిగా దొరలా దోచుకుపో యమ దర్జాగా
గెలిచానే నీ హృదయం కలకాలం ఈ విజయం నీతో పంచుకోనా ప్రియురాలా నా ప్రాణం నీ పాపిట సింధూరంగా నిలపనా
కలలన్నీ ఈ నిమిషం నిజమయ్యే సంతోషం నాలో దాచగలనా దరిచేరే నీ కోసం చిరునవ్వుల నీరాజనం ఇవ్వనా
ముస్తాబు చెయ్యరటే ఈ ముద్దుల గుమ్మకీ సిగ్గుపడు చెంపకి సిరి చుక్క దిద్దరే
పట్టు చీర కట్టరటే ఈ పుత్తడి బొమ్మకి తడబడు కాళ్ళకి పారాణి పెట్టరే
వగలన్నీ నిగనిగలాడగా నన్నల్లే కౌగిల్లో నగలన్నీ వెలవెల బోవా చేరందే నీ వొళ్ళో
నాకే సొంతం కానీ నీ సొమ్ములన్నీ
హరిలో రంగా హరి వహ్వా అంటూ చూస్తోంది పందిరి బరిలో హోరా హోరి బహు బాగుంది బాజా భాజంతిరి
అత్తారింటికి నిన్నెత్తుకుపోతానుగా వచ్చానే హంస వైభోగంగా కన్యాతనమిస్తా కళ్యాణం సాక్షిగా దొరలా దోచుకుపో యమ దర్జాగా
ఒట్టేసి చెపుతున్నా కడదాకా నడిపించే తోడై నేనున్నా ఏడడుగుల పయనానా ఏడేడు లోకాలైనా దాటనా
వధువై ఎదురొస్తున్నా వరమాలై ఎదపైన వాలే ముహూర్తాన వరసయ్యే వలపంతా చదివిస్తా వరకట్నంగా సరేనా
ముక్కోటి దేవతలు మక్కువగా కలిపారే ఎన్నెన్ని జన్మలదో ఈ కొంగుముడి
ముత్యాల జల్లుగా అక్షింతలు వెయ్యాలి ముచ్చట తీరేలా అంతా రండి
ఏనాడు ఎవరు చేరని ఏకాంతం వెతకాలి ఏ కన్ను ఎపుడు చూడని లోకంలో బతకాలి
పగలు రేయి లేని జగమేలుకొని