2026Shashi

అమ్మ అమ్మేగా

Vanda Devullu

Sreekanth Hariharan

Advertisement
లోకంలోని దేవుళ్ళంతా ఏకం అయ్యి వచ్చేసినా అమ్మ అమ్మేగా నింగి నేల ఒక్కటై నీకోసమే ఉన్నామన్నా అమ్మ అమ్మేగా నిప్పులా ఒకసారి నీడలా ఒకసారి మనకై మారెరా కాలమే కనుమూస్తూ బాధలే మింగివేస్తూ ఊపిరే పోసేరా
Advertisement
లోకమే అడ్డుకున్నా సొంతవాళ్ళే తప్పుకున్నా కొండలా అండగా ఉండురా కూలీలా సేవ చేస్తూ కొవ్వొత్తిలా కాలిపోతూ వెలిగే ప్రమిదే అమ్మరా అమ్మా మా అమ్మా
మేడ లొద్దు మిద్దె లొద్దు ఆస్తి పాస్తులేల అమ్మా నువ్వే మాపై చూపే ప్రేమే చాలమ్మా (2)
పుట్టగానే చూసి నన్ను చెమ్మగిల్లెనే బోసి మాటలాడేస్తే పొంగిపోయేనే తప్పుచేస్తే నేనసలు ఊరుకోదులే బెట్టమయ్యి సరిచేసి దారి చూపులే త్యాగాలెన్నో చేశావే..... నువ్వు త్యాగాలెన్నో చేశావే మాకోసమని అమ్మా నీకు సాటి ఎవరు లేరే నిద్రలెన్నో మరిచావే జోల పాడుతూ అమ్మా నాన్న తొలి దైవం మీరే
మేడ లొద్దు మిద్దె లొద్దు ఆస్తి పాస్తులేల అమ్మా నువ్వే మాపై చూపే ప్రేమే చాలమ్మా (2)
లోకంలోని దేవుళ్ళంతా ఏకం అయ్యి వచ్చేసినా అమ్మ అమ్మేగా నింగి నేల ఒక్కటై నీకోసమే ఉన్నామన్నా అమ్మ అమ్మేగా