2002

అడుగడుగు

Adugadugu

🎬 Bobby
Advertisement
అడుగడుగు గుండెనడుగు తడబడిన ఈడునడుగు ఏ మంత్రమో వేసావే మనసునే మగతగా కమ్మావే నీ నవ్వుతో చంపావే వయసునే వరదలా ముంచావే
Advertisement

గుండెలనుండి గుసగుసలేవో వెన్నులో పాకాయిలే ఊహకురాని తహ తహలేవో తాపం పెంచాయిలే నా నర నరం జివ్వంది తనువుతో అనుభవం అడిగింది
కోరికేదో తొలిమొటిమై పూసే తేనెలాగా చిరు చెమటై పోసే మాయ ఇది ఎవరిమాయ సిగ్గు నూనూగు చిగురే వేసే ఉగ్గపట్టి ప్రాణాలే తీసే మంత్రం చెలివేసే మంత్రం చూపడిగితే చెప్పలేని వయసు కోత ఆ ఆ ఆ వెన్నులోన చిలుకుతున్న తీపి బాధ...
గుండెలనుండి గుసగుసలేవో వెన్నులో పాకాయిలే ఊహకురాని తహ తహలేవో తాపం పెంచాయిలే నా నరం జివ్వంది తనువుతో అనుభవం అడిగింది
అడుగడుగు గుండెనడుగు తడబడిన ఈడునడుగు
గోరువెచ్చని ఊపిరికే వేడికొసలు చిరు తాకిడికే మేను మెరుపులా మెరిసింది ఈడు మెలికలే తిరిగింది చెలియ తుంటరి నవ్వులకే తలుపు తీయని కౌగిలికే వయసు భగ్గున మండింది తియ్య తియ్యగా కాల్చింది
చిగురాకులగా నా ఒళ్లే సెగ చిమ్మి వణుకుతూ ఉంది తమకాన్ని రేపే ని పెదవి నవనాడులాపుతూ ఉంది నా నర నరం జివ్వంది తనువుతో అనుభవం అడిగింది...
అడుగడుగు గుండెనడుగు తడబడిన ఈడునడుగు గుండెలనుండి గుసగుసలేవో వెన్నులో పాకాయిలే ఊహకురాని తహ తహలేవో తాపం పెంచాయిలే ఏ మంత్రమో వేసావే మనసునే మగతగా కమ్మవే నీ నవ్వుతో చంపావే వయసునే వరదలా ముంచావే